పుష్ప 2 "కిస్సిక్" ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్..! 3 d ago
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ నుండి మరో వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. తాజాగా మేకర్లు ఈ మూవీ లో డాన్సింగ్ క్వీన్ శ్రీలీల నటించిన స్పెషల్ సాంగ్ కిస్సిక్ పాట పూర్తి వీడియో సాంగ్ విడుదల చేసారు. ఈ సాంగ్ లో అల్లు అర్జున్, శ్రీలీల వేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు.